ఉత్తరాఖండ్: కారుపై విరిగిపడ్డ కొండచరియలు.. ఐదుగురు కేదార్‌నాథ్ యాత్రికులు మృతి
రుద్రప్రయాగ్ జిల్లాలో గురువారం రాత్రి కొండచరియలు విరిగిపడి.. కేదార్‌నాథ్ యాత్రకు వెళ్తోన్న భక్తుల వాహనంపై పడ్డాయి. దీంతో శిథిలాల కింద వీరంతా కూరుకుపోయారు. మట్టి కింద కూరుకుపోయిన వాహనాన్ని శుక్రవారం ఉదయం శిథిలాల నుంచి వెలికి తీశారు. అందులో ఐదు మృతదేహాలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు గుజరాతీలు, ఒకరు హరియాణా వాసి ఉన్నారని. ఇంకో వ్యక్తిని గుర్తించాల్సి ఉందని ఉత్తరాఖండ్ పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు, ఆ రాష్ట్రానికి ఐఎండీ రెడ్ అలర్ట్ జారీచేసింది.
By August 12, 2023 at 10:57AM
By August 12, 2023 at 10:57AM
No comments