Breaking News

దేశంలోని ఎమ్మెల్యేల ఆస్తులు రూ.54 వేల కోట్లు.. ఆ రాష్ట్రాల బడ్జెట్ కంటే కర్ణాటక ఎమ్మెల్యేల ఆస్తులే ఎక్కువ..!


MLA Assets: ఒక ఎమ్మెల్యే అంటే ధన బలం, మంద బలం ఉంటుంది. ఎమ్మెల్యే చుట్టూ చాలా మంది అనుచరులు నిత్యం తిరుగుతూనే ఉంటారు. కార్లు, జెండాలు, నినాదాలతో ఎప్పుడూ హోరెత్తిస్తూనే ఉంటారు. ఇక ఆ ఎమ్మెల్యే రోజు వారీ ఖర్చులు చూస్తే భారీగానే ఉంటాయి. ఒకప్పుడు సాధారణ పౌరులే ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిచేవారు. కానీ ఇప్పుడు ఒక్కడో ఒక చోట తప్పితే.. కోటీశ్వరులే ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నారు. అయితే మన దేశంలో మొత్తం అన్ని రాష్ట్రాల్లో కలిపి 4 వేలమందికిపైగా ఉంటారు. ఇక వీరందరి దగ్గర ఉన్న ఆస్తుల విలువ అక్షరాలా రూ. 55 వేల కోట్లు. అయితే ఈ లెక్కలను అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ - ఏడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్ - ఎన్ఈడబ్ల్యూ సంస్థలు సంయుక్తంగా ఓ రిపోర్ట్‌ను విడుదల చేశాయి. ఇందులో కర్ణాటక ఎమ్మెల్యేల మొత్తం ఆస్తుల విలువ దేశంలోని 3 రాష్ట్రాల వార్షిక బడ్జెట్ మొత్తం కలిపినా ఎక్కువే ఉండటం గమనార్హం. ఇక బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల ఆస్తుల మొత్తం విలువ రూ. 32 వేల కోట్లకుపైనే అని వెల్లడించింది. దేశంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లలో పొందుపర్చిన సమాచారం ఆధారంగా ఈ రెండు సంస్థలు నివేదికను రూపొందించాయి.

By August 02, 2023 at 11:16AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/indias-mlas-worth-more-than-combined-budgets-of-3-states/articleshow/102339106.cms

No comments