Breaking News

వీడు హీరో ఏంట్రా అన్న ప్రతి ఒక్కడికి.. సరిగ్గా 20 ఏళ్ల తర్వాత ఆన్సర్, హేటర్స్ కూడా హ్యాట్సాఫ్ అనేలా బన్నీ జర్నీ..!


ఏంటి కామెడీయా.. దొబ్బెస్తున్నారా.. అంటూ సోషల్ మీడియా తెగ ట్రోల్ చేస్తున్న ఆ వాయిసే ఇప్పుడు.. జాతీయ చలనచిత్ర యవనికపై తెలుగు సినిమా సత్తా చాటి తగ్గేదేలే అని నిరూపించింది. వీడు హీరో ఏంట్రా అని సరిగ్గా 20 ఏళ్ల క్రితం విమర్శలు ఎదుర్కొన్న ఆ కుర్రాడే.. ఈరోజు నేషనల్ బెస్ట్ యాక్టర్‌గా నిలిచాడు. తండ్రి ప్రొడ్యూసర్ కాకపోయుంటే సైడ్ యాక్టర్‌గా కూడా ఎవరూ చూడరు అంటూ ఎద్దేవా చేసిన ఆ వ్యక్తే.. ఇప్పుడు ఐకాన్ స్టార్‌గా మారి.. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ఎంతో మంది అభిమానుల్ని సాధించుకున్నాడు. అల్లు అర్జున్ అంటే ఇప్పుడు ఓ పేరు కాదు.. బ్రాండ్‌గా మార్చుకున్నాడు. 20 ఏళ్ల కింద గంగ్రోత్రి సినిమాతో తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన బన్నీ.. ఎన్నో విమర్శలు, ఇంకెన్నో ఒడుదొడుకులు దాటుకుని అంతకు మించిన కష్టంతో స్టైలిష్ స్టార్‌ నుంచి ఐకాన్ స్టార్‌గా ఎదిగిన తీరు.. అద్భుతం. దానికి నిదర్శనమే.. 69 ఏళ్ల చరిత్రలో ఏ తెలుగు హీరో సాధించలేని జాతీయ ఉత్తమ నటుడి అవార్డును సాధించి.. రికార్డు.. కాదు కాదు తెలుగు సినిమాకు ఓ బ్రాండ్ సృష్టించారు అల్లు అర్జున్.

By August 25, 2023 at 02:09AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/national-best-actor-icon-star-allu-arjun-20-years-of-inspiring-journey-in-telugu-film-industry-from-gangotri-to-pushpa/articleshow/103034968.cms

No comments