జల్లికట్టు ఆట విషయంలో తమిళ తంబీలకు సుప్రీంకోర్టు గుడ్‌న్యూస్, స్టాలిన్ సర్కార్‌కు భారీ ఊరట
Jallikattu: తమిళనాడులో జరిగే సంప్రదాయ ఆట జల్లికట్టుకు అడ్డంకులు తొలిగిపోయాయి. జల్లికట్టును ఆపాలంటూ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లను అత్యున్నత ధర్మాసనం కొట్టేసింది. దీంతో తమిళనాడులో జల్లికట్టు ఆట నిర్వహించేందుకు మార్గం సుగమమైంది. జల్లికట్టు ఆటను కొనసాగించాలని తమిళనాడు అసెంబ్లీ చేసిన చట్టాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. దీంతో తమిళనాడు వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తమిళనాడులోని రాజకీయ పార్టీల నేతలు, జల్లికట్టు నిర్వాహకులు, అభిమానులు స్వాగతించారు.
By May 18, 2023 at 12:55PM
By May 18, 2023 at 12:55PM
No comments