న్యాయశాఖ మంత్రి పదవి నుంచి కిరణ్ రిజిజు బదిలీ.. కొలీజియంపై చేసిన వ్యాఖ్యలే కారణమా?
Kiren Rijiju: కేంద్ర మంత్రివర్గంలో కీలక మార్పులు జరిగాయి. ఇప్పటివరకు కేంద్ర న్యాయ శాఖ మంత్రిగా ఉన్న కిరణ్ రిజిజు నుంచి ఆ శాఖను తొలగించి.. కేంద్ర భూవిజ్ఞాన శాస్త్ర శాఖకు బదిలీ చేశారు. కిరణ్ రిజిజు స్థానంలో కొత్త న్యాయశాఖ మంత్రిగా.. ఇప్పటివరకు కేంద్ర సహాయశాఖ మంత్రిగా ఉన్న అర్జున్ రామ్‌మేఘ్‌వాల్‌కు అప్పగించారు. అర్జున్ రామ్‌మేఘ్‌వాల్.. ప్రస్తుతం పార్లమెంటరీ వ్యవహారాల సహాయశాఖ, సాంస్కృతిక శాఖ సహాయమంత్రిగా ఉన్నారు. ఈ మేరకు మంత్రివర్గంలో మార్పులు చేస్తూ రాష్ట్రపతి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
By May 18, 2023 at 12:03PM
By May 18, 2023 at 12:03PM
No comments