హైకమాండ్ బుజ్జగింపులతో కొలిక్కివచ్చిన కన్నడ రాజకీయం.. సీఎం, డిప్యూటీ సీఎంలు వాళ్లే
Siddaramaiah: కొన్నిరోజులుగా రసవత్తరంగా మారిన కన్నడ రాజకీయం కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. పొత్తులతో సంబంధం లేకుండా.. సొంతంగా మేజిక్ ఫిగర్‌ను దాటేసిన కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి ఎవరో తేల్చడం తీవ్ర తలనొప్పిగా మారింది. మాజీ సీఎం సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కుర్చీ కోసం పోటీ పడి వెనక్కి తగ్గకపోవడంతో హై కమాండ్‌కు సవాల్‌గా మారింది. దీంతో కన్నడ రాజకీయం కాస్త.. ఢిల్లీకి చేరింది. అగ్రనేతల బుజ్జగింపులు, హామీలతో వివాదం సద్దుమణిగినట్లు హస్తం వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
By May 18, 2023 at 11:06AM
By May 18, 2023 at 11:06AM
No comments