రూ.1650 కోట్లతో భవంతి కొన్న సెలబ్రిటీ జంట.. అమెరికాలో ఖరీదైన రెండో భవనం
అమెరికా పాప్ సింగర్స్ బియాన్స్, ఆమె భర్త ర్యాపర్ జే-జెడ్ (Jay-Z)కొత్తగా ఓ విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేశారు. కాలిఫోర్నియాలో కొనుగోలు చేసిన ఈ భవంతి ఖరీదు అక్షరాలా 200 మిలియన్ల డాలర్లు (మన కరెన్సీలో రూ.1,656 కోట్లు). అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. సింగర్ బియాన్స్ (Singer Beyonce) దంపతులు కొనుగోలు చేసిన ఇల్లు కాలిఫోర్నియాలోని మాలిబు ప్రాంతంలో ఉంది. ఆ రాష్ట్రంలో కొనుగోలు చేసిన అత్యంత ఖరీదైన ఆస్తి ఇదే కావడం మరో విశేషం. జపాన్‌కు చెందిన ఆర్కిటెక్ట్ టడావో ఆండో డిజైన్ చేసిన ఈ ఇంటి నుంచి పసిఫిక్ మహాసముద్ర తీరం అందాలను వీక్షించవచ్చు.
By May 21, 2023 at 08:18AM
By May 21, 2023 at 08:18AM
No comments