Poonch Attack: డ్రోన్ల సాయంతో పాక్ నుంచి ఆయుధాలు.. స్ధానికుల అండతో ఉగ్రవాదులు మెరుపుదాడి
రంజాన్ నేపథ్యంలో ముస్లిం సోదరుల కోసం పండ్లను తీసుకెళ్తోన్న సైనికులపై ముష్కర మూకలు ఘాతుకానికి పాల్పడ్డాయి. గత గురువారం పూంచ్ వద్ద జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్లు అమరులయ్యారు. భింబర్ గలీ నుంచి సాంగియోట్‌కు ఇఫ్తార్ విందు కోసం పండ్లను తీసుకెళుతున్న సైనిక వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు... దర్యాప్తును వేగవంతం చేశారు. పాక్ నుంచి వచ్చిన ఆయుధాలతోనే సైనికుల వాహనంపై మెరుపు దాడికి తెగబడ్డారని చెప్పారు.
By April 29, 2023 at 07:34AM
By April 29, 2023 at 07:34AM
No comments