Pakistan: పోలీస్ స్టేషన్‌లో పేలుళ్లు.. 13 మంది అధికారులు మృతి.. 50 మందికిపైగా గాయాలు
Pakistan: ఉగ్రవాదుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న పాక్‌లోని స్వాత్ లోయలో సోమవారం శక్తివంతమైన పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో డజను మందికిపైగా పోలీస్ అధికారులు చనిపోగా.. మరో 50 మంది గాయపడ్డారు. ఈ ప్రాంతం 2009కి ముందు చాలా కాలం పాటు తీవ్రవాద సంస్థల అధీనంలో ఉందని అధికారులు తెలిపారు. పేలుళ్ల వెనుక ఉగ్రవాదుల హస్తం లేనట్టు భావిస్తున్నారు. నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగినట్టు అనుమానిస్తున్నామని పోలీస్ అధికారులు పేర్కొన్నారు.
By April 25, 2023 at 06:50AM
By April 25, 2023 at 06:50AM
No comments