బెంగాల్‌లో మరోసారి శోభాయాత్రలో ఘర్షణ.. రాళ్లదాడిలో బీజేపీ ఎమ్మెల్యేకు గాయాలు
పశ్చిమ బెంగాల్‌లో శ్రీరామ నవమి వేడుకల్లో చోటుచేసుకున్న ఘర్షణలపై అధికార టీఎంసీ, బీజేపీలు పరస్పర విమర్శలు గుప్పించుకుంటున్నాయి. ఈ ఘటనలపై టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ.. నెలరోజులుగా అల్లర్లకు బీజేపీ ప్రణాళికలు రూపొందించిందని ఆరోపించారు. అదానీ ఉదంతంపై విపక్షాల ప్రశ్నల దాడిని తప్పించుకునేందుకు కాషాయ పార్టీ అల్లర్ల కుట్రకు తెరలేపిందని ఆమె మండిపడ్డారు. ఇక, బీజేపీ సైతం టీఎంసీపై ఎదురుదాడి చేస్తోంది. మమతా బెనర్జీ హిందూ వ్యతిరేకి అంటూ ఆరోపణలు చేసింది.
By April 03, 2023 at 07:48AM
By April 03, 2023 at 07:48AM
No comments