ఒకటి రెండు కాదు 138 ఏళ్ల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల.. సంబరాల్లో ఫ్యామిలీ
ఓ వంశంలో చివరిసారిగా 138 ఏళ్ల కిందట ఆడపిల్ల పుట్టింది. అప్పటి నుంచి పుట్టిన పిల్లలంతా అబ్బాయిలే కావడంతో తమలో ఎవరికైనా అమ్మాయి పుట్టకపోదా అని తరాలుగా నిరీక్షించారు. చివరకు వారి ఆశలు ఫలించి ఇటీవల ఆ కుటుంబంలో పండంటి పాపాయి అడుగుపెట్టింది. దీంతో వారు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఏంతో అపురూపంగా పాపను చూసుకుంటున్నారు. అమెరికా మిషిగాన్‌లోని కలడోనియాలో నివసిస్తోన్న క్లార్క్ కుటుంబంలో 1885 నుంచి అమ్మాయే జన్మించలేదు.
By April 07, 2023 at 07:42AM
By April 07, 2023 at 07:42AM
No comments