Breaking News

బట్టలు విప్పదీసి, బలవంతంగా మతపరమైన నినాదాలు చేయించి.. 11 ఏళ్ల చిన్నారిపై దాష్టీకం


తన ఇంటి సమీపంలో ఆడుకుంటోన్న పదకొండేళ్ల బాలుడ్ని కొందరు బొమ్మలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి తీసుకెళ్లారు. ఓ ప్రాంతానికి తీసుకెళ్లిన తర్వాత చిన్నారిని హింసించి, బలవంతంగా మతపరమైన నినాదాలు చేయించారు. ఈ అమానుష ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటుచేసుకుంది. అంతటితో ఆగకుండా వీడియో తీశారు. నిందితులు కూడా మైనర్లు కావడం గమనార్హం. ఇండోర్ నగరం లసూదియా పోలీస్ స్టేషన్ పరిధిలోని నిపానియా ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేశారు.

By April 14, 2023 at 08:38AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/11-year-old-stripped-and-forced-to-chant-religious-slogans-in-indore-of-madhya-pradesh/articleshow/99480039.cms

No comments