మే 1 నుంచి షిర్డీలో బంద్.. సంస్థాన్ ట్రస్ట్‌కు వ్యతిరేకంగా గ్రామస్థులు కీలక నిర్ణయం
షిర్డీ సాయిబాబా ఆలయానికి సీఐఎస్ఎఫ్ జవానల్తో భద్రత కల్పించాలని సంస్థాన్ ట్రస్ట్ నిర్ణయించింది. అయితే, ప్రతిపాదనలపై స్థానికులు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మే 1 నుంచి షిర్డీలో నిరవధిక బంద్‌ను చేపడతామని గ్రామస్థులు హెచ్చరించారు. మరోవైపు, సీఐఎస్‌ఎఫ్ జవాన్లతో భద్రతను ఏర్పాట్లపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే ఈ నిర్ణయం సరైంది కాదని, దీనికి మేము అంగీకరించబోమని తెగేసి చెప్పిన గ్రామస్థులు.. మే 1 న కార్యాచరణ ప్రకటిస్తారు.
By April 28, 2023 at 10:05AM
By April 28, 2023 at 10:05AM
No comments