Breaking News

ఇమ్రాన్ అరెస్ట్‌పై కొనసాగుతున్న ప్రతిష్టంభన.. పోలీసులపై ఇటుకలు, రాళ్లతో విరుచుకుపడ్డ పీటీఐ కార్యకర్తలు


పాకిస్థాన్ ప్రధానిగా ఉన్న సమయంలో ఇమ్రాన్‌ఖాన్‌ విదేశీ పర్యటనలకు వెళ్లేటప్పుడు ఆయనకు వచ్చిన బహుమతులు, కానుకలను విక్రయించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి వీటిని ప్రభుత్వ ఖజానా తోషాఖానాలో జమ చేయాలి. ఈ కేసుకు సంబంధించిన ఇటీవల జరిగిన విచారణకు ఇమ్రాన్‌ హాజరుకాకపోవడం వల్ల న్యాయస్థానం ఆయనపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్ జారీ చేసింది. ఇమ్రాన్‌ ఖాన్‌‌ను అరెస్ట్‌ చేయడానికి రెండు రోజులుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో ఆయన పార్టీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు.

By March 15, 2023 at 10:12AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/stand-off-over-ex-pm-imran-khans-arrest-continues-for-second-day-in-pakistan/articleshow/98648276.cms

No comments