ఈక్వెడార్, పెరూలో కుదిపేసిన భారీ భూకంపం.. 14 మంది మృతి
ఈక్వెడార్, పెరూలను శక్తివంతమైన భూకంపం వణికించింది. ఈ భూకంపం ధాటికి ఇప్పటివరకు 14 మంది మృతిచెందగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, అధికంగా ప్రాణనష్టం ఈక్వెడార్‌లోనే ఉంది. మచలా, క్యూన్కాలో భూకంప కారణంగా చాలా భవనాలు నేలమట్టం కాగా.. భారీ ఆస్తి నష్టం వాటిల్లినట్లు స్థానిక మీడియా తెలిపింది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గుయాక్విల్, క్విటో, మనాబి, మంటా సహా ఇతర నగరాల్లోనూ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
By March 19, 2023 at 09:37AM
By March 19, 2023 at 09:37AM
No comments