నేటి నుంచే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. అస్త్రశస్త్రాలతో సిద్ధమైన అధికార విపక్షాలు
గతేడాది జులై 25 రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ద్రౌపది ముర్ము.. ఉభయ సభలను ఉద్దేశించి మంగళవారం తొలిసారిగా ప్రసంగించనున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రాష్ట్రపతి ప్రసంగంతో మొదలయ్యే సంప్రదాయం ఉంది. దీంతో ఆమె సంయుక్త సమావేశంలో ప్రసగించి.. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశాలు, లక్ష్యాలను సభ ముందు ఉంచనున్నారు. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు. మర్నాడు బడ్జెట్ ఉంటుంది.
By January 31, 2023 at 07:53AM
By January 31, 2023 at 07:53AM
No comments