Mahesh Babu: కుటుంబ సభ్యులతో విజయవాడ చేరుకున్న మహేష్ బాబు

సినీ నటుడు మహేష్ బాబు (Mahesh Babu) ఈరోజు తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ (Superstar Krishna) అస్థికలను విజయవాడలోని పవిత్ర కృష్ణా నదిలో కలపనున్నారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి సోమవారం ఉదయం మహేష్ బాబు విజయవాడ చేరుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో దిగిన మహేష్ బాబు, ఆయన కుటుంబ సభ్యులు.. అక్కడి నుంచి కార్లలో విజయవాడ బయలుదేరారు. మహేష్ బాబు వెంట త్రివిక్రమ్ శ్రీనివాస్, పలువురు సినీ ప్రముఖులు ఉన్నారు.
By November 21, 2022 at 11:03AM
By November 21, 2022 at 11:03AM
No comments