Guwahati High Court బుల్డోజర్లతో ఇళ్లు కూల్చమని ఏం చట్టం చెప్పింది.. ఇది గ్యాంగ్‌వార్ లాంటిదే.. హైకోర్టు ఆగ్రహం

Guwahati High Court నేరస్తుల ఇళ్లను, వాళ్లకు సంబంధించిన స్థిరాస్తులను బుల్డోజర్లతో నేలమట్టం చేసే సంస్కృతిపై గువాహటి హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఉత్తరాదిలో ఇటీవల కాలంలో ఇటువంటి చర్యలు అధికమయ్యాయి. ఇక, శాంతిభద్రతలను కాపాడిన ఘనతను బుల్‌డోజర్‌లకు ఆపాదించడం మొదలుపెట్టారు బీజేపీ కార్యకర్తలు, నేతలు. అంతేకాదు, బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఈ మోడల్‌ను విరివిగా అనుసరించడం మొదలు పెట్టారు. అసోంలోనూ పలు సందర్బాల్లో అక్కడి ప్రభుత్వం ఇటువంటి చర్యలు చేపట్టింది.
By November 20, 2022 at 08:16AM
By November 20, 2022 at 08:16AM
No comments