Ex PM Imran Khan ఇమ్రాన్‌ను చంపాలనుకోడానికి అదే కారణం.. నిందితుడు

Imran Khan మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్‌పై ఓ దుండగుడు తుపాకీతో కాల్పులకు పాల్పడిన విషయం తెలిసిందే. ముందస్తు ఎన్నికలను నిర్వహించాలంటూ గత కొద్ది రోజుల నుంచి డిమాండ్ చేస్తున్న మాజీ ప్రధాని.. గత శుక్రవారం లాహోర్ నుంచి ఇస్లామాబాద్‌కు లాంగ్ మార్చ్ చేపట్టారు. ఇందులో భాగంగా ఆయన గురువారం పంజాబ్ ప్రావిన్సుల్లోని వజీరాబాద్‌లో ర్యాలీ నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకొంది. తూటా తగిలి ఇమ్రాన్ గాయపడ్డారు. కాల్పుల్లో ఒకరు మృతిచెందగా, ఏడుగురు గాయపడినట్టు పోలీసులు తెలిపారు.
By November 04, 2022 at 10:41AM
By November 04, 2022 at 10:41AM
No comments