UK PM Rishi Sunak హిందువునని గర్వంగా చెప్పుకుని.. భగవద్గీతపై ప్రమాణం

Rishi Sunak News In Telugu చదువుకునే రోజుల్లోనే కన్జర్వేటివ్ పార్టీలో ఇంటర్న్‌షిప్ చేసిన రిషి సునాక్.. ఆ తర్వాత 2014లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2015లో జరిగిన సాధారణ ఎన్నికల్లో రిచ్‌మాండ్ స్థానం నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన 2017 ఎన్నికలు, 2019లో జరిగిన కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ ఎన్నికల్లో రిషి గెలిచారు. అనంతరం బోరిస్ జాన్సన్‌కు మద్దతిచ్చారు. ఆయన ప్రధానిగా ఎన్నికైన తర్వాత రిషికి ఆర్థిక శాఖలో చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించారు. జాన్సన్‌కు అత్యంత నమ్మకస్థుడిగా గుర్తింపు తెచ్చుకుని, ఛాన్సలర్ పదవిని దక్కించుకున్నారు.
By October 25, 2022 at 09:35AM
By October 25, 2022 at 09:35AM
No comments