Prahbas: రెండుసార్లు చూశా.. థ్రిల్లింగ్ క్లైమాక్స్.. ‘కాంతార’పై మనసు పారేసుకున్న ప్రభాస్

Prabhas: ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ సినిమా గురించే చర్చ. చిన్న సినిమాగా విడుదలై ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్‌లో ప్రేక్షకుల ముందుకు వెళ్తోంది. ఇప్పటికే హిందీలో విడులైంది. రేపు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అదే ‘కాంతార’. కన్నడ దర్శక హీరో రిషబ్ శెట్టి తెరకెక్కించిన ఈ సినిమా కేవలం సినీ ప్రేక్షకులను మాత్రమే కాదు.. సినీ పరిశ్రమలనే కదిలిస్తోంది. ప్రశంసలు అందుకుంటోంది. ఇలాంటి కాన్సెప్ట్ ఇది వరకు ఎన్నడూ చూడలేదని వివిధ భాషలకు చెందిన హీరోలు కొనియాడుతున్నారు. వారిలో తెలుగు హీరోలు కూడా ఉన్నారు.
By October 14, 2022 at 11:29PM
By October 14, 2022 at 11:29PM
No comments