Breaking News

Maharashtra కెమిల్ ప్లాంట్‌లో ప్రమాదం: ముగ్గురు మృతి.. పేలుడు ధాటికి ఎగిరిపడ్డ పైకప్పు


వస్త్ర పరిశ్రమలో వినియోగించే గామా యాసిడ్‌ను తయారుచేసే ప్లాంట్‌లో పేలుడు సంభవించి కనీసం ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. గురువారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఫ్యాక్టరీ పైకప్పు ఊడిపడింది. పరిశ్రమలోని రియాక్టర్‌లో పేలుడు జరిగినట్టు అధికారులు పేర్కొన్నారు. రియాక్టర్‌లో ఒత్తిడి వల్లే ప్రమాదం జరిగిందా? లేదా మరేదైనా కారణమా? అనేది దర్యాప్తులో వెల్లడవుతుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయాందోళన నెలకుంది.

By October 27, 2022 at 09:07AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/three-killed-and-12-injured-in-blast-at-palghar-chemical-factory-in-maharashtra/articleshow/95111284.cms

No comments