Breaking News

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అభిషేక్ రావు అరెస్ట్.. టీఆర్ఎస్ నేతలతో సత్సంబంధాలు..?


Abhishek Rao:ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ దూకుడు పెంచింది. ఇప్పటికే విజయ్ నాయర్‌ను అరెస్ట్ చేయగా.. తాజాగా హైదరాబాద్‌కు చెందిన బోయినపల్లి అభిషేక్ రావును సీబీఐ అరెస్ట్ చేయడం తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి ఢిల్లీకి సీబీఐ అధికారులు ఆయనను తీసుకెళ్తున్నారు. అభిషేక్‌రావుతో టీఆర్ఎస్ నేతలకు సంబంధాలు ఉన్నాయనే ప్రచారం గతంలో జరిగింది. ఈ తరుణంలో బోయినపల్లి అభిషేక్ రావును సీబీఐ అరెస్ట్ చేయడం టీఆర్ఎస్ వర్గాలను కలవరపెడుతోంది.

By October 10, 2022 at 09:29AM


Read More https://telugu.samayam.com/telangana/abhishek-rao-arrested-in-delhi-liquor-scam-/articleshow/94751214.cms

No comments