Kashmir Apple: ‘14 కేజీల ఆపిల్ పండ్ల బాక్స్ రూ.250కే’
రైతులను ఆదుకోవడం, వారి ఆదాయాన్ని పెంచడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బోలెడన్ని పథకాలు అమలు చేస్తున్నాయి. పీఎం కిసాన్ యోజన, రైతు బంధు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్.. ఇవన్నీ ఆ కోవలోకే వస్తాయి. కానీ ఏళ్లు గడిచినా రైతు ఆర్థిక పరిస్థితిలో మాత్రం మార్పు రావడం లేదు. సాగు ఖర్చులు పెరిగిపోవడంతో లాభాల మాట అటుంచితే నష్టాలే మిగులుతున్నాయి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దాదాపుగా రైతులందరిదీ ఇదే సమస్య. పంటసాగు కోసం పెడుతున్న పెట్టుబడికి.. వస్తున్న ఆదాయానికి పొంతన ఉండటం లేదు. ప్రకృతి వైపరీత్యాలు, గిట్టుబాటు ధర లేకపోవడం, కూలీల ఖర్చులు పెరగడం తదితర కారణాలతో రైతుల చేతిలో ఏమీ మిగలడం లేదు. మన దగ్గర వరితోపాటు పత్తి, మిర్చి లాంటి మెట్ట పంటలు సాగు చేసే రైతులే కాదు.. కశ్మీర్లో ఆపిల్ పండ్లను సాగు చేసే రైతులది కూడా తీవ్ర ఇబ్బందులను, నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది కశ్మీర్లో ఆపిల్ చెట్లు విరగకాశాయి. చెట్ల మీద పండ్లను చూస్తుంటేనే కడుపు నిండిపోతోంది. కానీ ఏజెంట్లు చెబుతున్న ధర చూస్తే రైతుల గుండె చెరువవుతోంది. కశ్మీర్ లోయకు చెందిన రైతు కొడుకైన బషారత్ అలీ.. ఆపిల్ రైతుల దుస్థితిని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
By October 10, 2022 at 09:33AM
By October 10, 2022 at 09:33AM
No comments