Breaking News

వందే భారత్ రైలు.. విమానం లాంటి ఎక్స్‌పీరియన్స్, ప్రత్యేకతలివే


దేశంలో మూడో వందే భారత్ రైలును (Vande Bharat Train) ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. శుక్రవారం (సెప్టెంబర్ 30) ఉదయం గాంధీనగర్‌ - ముంబై మార్గంలో జెండా ఊపి ఈ రైలును ప్రారంభించిన మోదీ.. ఆ తర్వాత రైలెక్కి అందులోని వసతులను పరిశీలించారు. అనంతరం రైల్లో కొంతదూరం ప్రయాణించారు. అహ్మదాబాద్‌లోని కాల్పుర్‌ రైల్వే స్టేషన్‌ వరకు ఈ రైలులో ప్రధాని ప్రయాణించారు. మోదీతో పాటు రైల్వే సిబ్బంది కుటుంబాలు, కొంత మంది మహిళా వ్యాపారవేత్తలు, యువత ఈ రైల్లో ప్రయాణించారు. మోదీ వారిని ఆప్యాయంగా పలుకరించి ముచ్చటించారు. ప్రధానితో కలిసి వారంతా ఫొటోలు తీసుకున్నారు. ఈ సెమీ హైస్పీడ్ రైలు.. విమానం లాంటి అనుభూతిని ఇవ్వనుంది. వందే భారత్ రైలు ప్రత్యేకతలు..

By September 30, 2022 at 10:53PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/all-about-vande-bharat-express-a-semi-high-speed-train-that-offers-flight-like-experience/articleshow/94570638.cms

No comments