Bengaluru వరదలు.. తిరిగి వర్క్ ఫ్రమ్ హోమ్‌కి అనుమతిస్తున్న కంపెనీలు
ఒక్కరోజు వర్షానికే బెంగళూరు నగరం జలమయమైంది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయితే, మరో ఐదు రోజులు నిరంతరంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ఆందోళన నెలకుంది. ఈ నెల 9 వరకూ బెంగళూరులో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవవచ్చునని తెలిపింది. దీంతో పాటు కర్ణాటకలోని పలు జిల్లాలకు వర్షసూచన ఉంది. మాండ్య, చామరాజనగర సహా అనేక జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. ఐఎండీ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు.
By September 06, 2022 at 01:27PM
By September 06, 2022 at 01:27PM
No comments