కుమారుడి శవం పక్కనే కూర్చొని.. నాలుగు రోజులు గడిపిన 82 ఏళ్ల వృద్ధుడు
అది మొహాలీలోని ఓ ఇల్లు. ఇంట్లో తండ్రీ కొడుకులు మాత్రమే ఉంటున్నారు. ఏమైందో తెలీదు కానీ.. నాలుగు రోజుల క్రితం కుమారుడు ఇంట్లోనే ప్రాణాలు కోల్పోయాడు. 82 ఏళ్ల తండ్రి ఈ విషయాన్ని గుర్తించలేకపోయాడు. కుమారుడి శవం పక్కనే నాలుగు రోజులపాటు గడిపాడు. ఆ ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో.. ఇరుగుపొరుగు వారు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వచ్చి ఆ పెద్దాయనను హాస్పిటల్‌లో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది.
By August 31, 2022 at 11:49AM
By August 31, 2022 at 11:49AM
No comments