పాక్‌లో దాష్టీకం.. నవ శిశువు తలను వేరుచేసి హిందూ మహిళ కడుపులో వదిలేసిన డాక్టర్లు
పాకిస్థాన్‌లో వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్ట లాంటి ఘటన ఇది. పురిటి నొప్పులతో వచ్చిన ఓ గర్భిణికి ఆస్పత్రి సిబ్బంది నిర్వాకం ప్రాణాలు మీదకు తెచ్చింది. సిజేరియన్ చేసి పురుడు పోయాలని ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లారు. గైనకాలజిస్ట్ లేకపోవడంతో పొట్టను కోశారు. వారి నిర్లక్ష్యంతో కడుపులోని బిడ్డ తల వేరుపడింది. దానిని అలాగే వదిలేసిన దారుణమైన ఘటన పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్సుల్లో ఆదివారం చోటుచేసుకుంది. దీనిపై విమర్శలు రావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
By June 21, 2022 at 12:55PM
By June 21, 2022 at 12:55PM
No comments