ఇడ్లీ అమ్మకు ఇల్లు.. మదర్స్ డే నాడు మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా

వడివెలామ్‌పాళ్యం గ్రామానికి చెందిన కమలాత్తాళ్ గురించి మూడేళ్ల కిందట తెలుసుకున్న ఆనంద్ మహీంద్రా.. ఆమె కట్టెల పొయ్యిపై ఇడ్లీలు ఉడికించడం తెలుసుకుని ఆశ్చర్యపోయారు. 80 ఏళ్ల వయసులోనూ ఆమె ఎటువంటి అలుపు సొలుపు లేకుండా ఉత్సాహంగా పనిచేయడం చూసి ఆశ్చర్యపోయారు. ఆమె వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నట్లు తెలిపారు. ఎల్పీజీ గ్యాస్ స్టవ్, మిక్సీ, గ్రైండర్ వంటివి సమకూర్చనున్నట్టు తెలిపారు. గతేడాది తన హామీలను మరింత పెంచుతూ... సొంతంగా ఇల్లు నిర్మించి ఇస్తామని తెలిపారు.
By May 09, 2022 at 10:28AM
By May 09, 2022 at 10:28AM
No comments