Breaking News

RRR సరికొత్త చరిత్ర.. గతంలో ఎన్నడూలేని విధంగా రాజమౌళి స్కెచ్


దేశం చూపు వైపు. తాజా పరిస్థితి ఇదే మరి. దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన మరో భారీ పాన్ ఇండియా సినిమా RRR విడుదలకు రెడీ కావడంతో యావత్ సినీ లోకం అటుగా చూస్తోంది. మార్చి 25వ తేదీన పలు భాషల్లో ఈ మూవీ గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సినిమా మేకింగ్ కోసం రాజమౌళి సహా నటీనటులు, ఇతర టెక్నిషియన్స్ ఎంత రిస్క్ తీసుకున్నారో మనకు బాగా తెలుసు. ఇంతలా కష్టపడి తెరకెక్కించిన తమ సినిమా చరిత్రలో నిలిచిపోవాలని రాజమౌళి స్కెచ్చేశారు. ఎన్నడూలేని విధంగా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చేలా RRR విడుదల చేయబోతున్నారు జక్కన్న. ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో RRR సందడి షురూ కాబోతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన భారీ మల్టీస్టారర్ సినిమాగా రాబోతున్న ఈ సినిమా కోసం ‘డాల్బీ సినిమా’ టెక్నాలజీని వాడుతున్నారు. ప్రేక్షకులకు దశ్య, శ్రవణ పరంగా మంచి అనుభూతి కలగాలని ఈ నిర్ణయం తీసుకున్నారట మేకర్స్. ఈ మేరకు అధికారిక ప్రకటన ఇచ్చారు. దీంతో డాల్బీ టెక్నాలజీతో విడుదల కాబోతున్న మొట్టమొదటి భారతీయ చిత్రంగా RRR తన పేరును లిఖించుకుంది. ఓవర్సీస్‌లో ఐమ్యాక్స్ లాంటి పెద్ద ఫార్మేట్స్‌లో ప్రీమియర్ షో గా ప్రదర్శించడానికి ఈ ‘డాల్బీ సినిమా’ టెక్నాలజీని వాడబోతున్నారు. అంతేకాదు యూకేలో ఉన్న ప్రపంచంలోనే అతి పెద్ద తెరపై డాల్బీ సినిమా టెక్నాలజీతో RRR ప్రీమియర్ షో ప్రదర్శించనుండటం గొప్ప విషయమని చెప్పుకోవాలి. 1920 బ్యాక్ డ్రాప్‌లో గ్రాండ్‌గా రాబోతున్న ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్, తమిళ నటుడు సముద్రఖని, సీనియర్ హీరోయిన్ శ్రీయ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఈ భారీ విజువల్ వండర్‌కి కీరవాణి అందించిన సంగీతం మేజర్ అట్రాక్షన్ అవుతుందని ఇప్పటికే విడుదల చేసిన సాంగ్స్, టీజర్ కన్ఫర్మ్ చేశాయి.


By March 14, 2022 at 07:54AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/rajamouli-super-plans-on-rrr-world-wide-grand-release/articleshow/90192419.cms

No comments