Breaking News

RRR బజ్.. ఏకంగా థియేటర్ కొనేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్! ఇదీ సంగతి


దేశ విదేశాల్లోని ఆడియన్స్ RRR మూవీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పలుసార్లు వాయిదాపడ్డ ఈ సినిమా చివరకు మార్చి 25న గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇప్పటినుంచే RRR బజ్ నెలకొంది. ఈ సినిమా ఫస్ట్ షో చూడాలని కుతూహలపడుతున్నారు మెగా, నందమూరి ఫ్యాన్స్. ఈ మేరకు విదేశాల్లోని ఫ్యాన్స్ ఏకంగా ఓ థియేటర్ కొనేశారని తెలుస్తుండటం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం RRR యూఎస్ ప్రీమియర్ సేల్స్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ఆ రిపోర్ట్స్ ప్రకారం సినిమా డిమాండ్ ఎలా ఉందనేది స్పష్టమవుతోంది. కాగా, ఫ్లోరిడా లోని ఎన్టీఆర్ అభిమానులైన కొందరు RRR ప్రీమియర్ చూసేందుకు ఏకంగా ఓ థియేటర్ అంతా బుక్ చేసుకున్నారట. ఫ్లోరిడాలోని సినిమార్క్ టిన్‌సెల్‌టౌన్‌లో 6 PM షో కోసం అన్ని ప్రీమియర్ టికెట్స్ బుక్ చేసుకొని ఎన్టీఆర్ పట్ల అభిమానాన్ని చాటుకున్నారు ఆయన ఫ్యాన్స్. అసలే భారీ సినిమా, పైగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ఒకే థియేటర్‌లో కూర్చొని ప్రీమియర్స్ చూడటమంటే ఇక ఆ హంగామా ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు. బాహుబలి సినిమాతో తెలుగోడి సత్తా ఎల్లలు దాటించిన దర్శకధీరుడు రాజమౌళి.. తిరిగి అదే రేంజ్‌లో RRR సినిమా తెరకెక్కించారు. DVV దానయ్య సమర్పణలో భారీ బడ్జెట్ కేటాయించి అన్ని హంగులతో ఈ సినిమా రూపొందించారు. చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కొమురం భీంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే విడుదల చేసిన RRR అప్‌డేట్స్ అన్ని వర్గాల ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేశాయి. 1920 బ్యాక్ డ్రాప్‌లో భారీ విజువల్ వండర్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర ప్రమోషన్స్ విషయంలో సరికొత్తగా ఆలోచిస్తూ సినిమాపై ఉన్న అంచనాలకు రెక్కలు కడుతున్నారు జక్కన్న. ప్రస్తుతం దేశ విదేశాల్లోని ఆడియన్స్ దృష్టి మొత్తం RRRపైనే ఉందని చెప్పడం అతిశయోక్తి లేదు.


By March 07, 2022 at 07:50AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/rrr-buzz-jr-ntr-fans-buys-out-entire-theater-in-florida/articleshow/90041455.cms

No comments