RGV: ఛార్మితో డ్రింక్ పార్టీ.. వర్మ వదిలిన ఫొటోతో నెట్టింట దుమ్ముదుమారం
రూటే సపరేటు. ఎవ్వరేమనుకుంటే నాకేంటి? నాకు నచ్చిందే నేను చేస్తా. నేనంటూ ప్రత్యేకంగా ఉంటా అనే స్వభావం ఆయనది. హీరోయిన్లతో ఎంజాయ్ చేయాలన్నా, రొమాంటిక్ మూడ్ ఆస్వాదించాలన్నా వర్మ తర్వాతే ఇంకెవరైనా అని చెప్పుకోవాలి. అట్లుండది మనతోటి అని రుజువు చేస్తూ ఆయన చేసిన బోల్డ్ ఇంటర్వూస్ ఓ రేంజ్‌లో రెస్పాన్స్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. సిచుయేషన్ ఏదైనా ఎంజాయ్ చేయడానికే ఆర్జీవీ తొలి ప్రాధాన్యం ఇస్తాడని ఆయన చేష్టల ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో తాజాగా హీరోయిన్, నిర్మాత ఫొటో షేర్ చేసి ఆన్ లైన్ మాధ్యమాలను షేక్ చేశారు రామ్ గోపాల్ వర్మ. ఓపెన్‌గా వర్మ వెళ్తున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తనకిష్టమైన వాళ్ళ ఫొటోలు, వీడియోలు, ఎంజాయ్ మూమెంట్స్‌ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకోవడం వర్మ స్టైల్. ఈ క్రమంలోనే బ్యూటిఫుల్ హీరోయిన్, నిర్మాత ఛార్మి ఫొటోను ఇన్స్‌స్టాలో షేర్ చేసిన వర్మ.. సర్కారీతో డ్రింక్ పార్టీ అంటూ కామెంట్ చేశారు. దీంతో క్షణాల్లో ఈ పిక్ వైరల్‌గా మారింది. ఎంజాయ్ అంటే నీదే వర్మ అన్నట్లుగా ఈ ఫొటోపై నెటిజన్ల కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. తాను ఎలాంటి తప్పు చేయడం లేదని, చట్టానికి లోబడి తనకు నచ్చినట్లుగా ఉంటున్నానని వర్మ ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. ఇదే బాటలో వెళుతూ హీరోయిన్ల ఫొటోలతో నెట్టింట రచ్చ మాత్రం బాగానే చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఏకంగా స్టార్ ప్రొడ్యూసర్ ఛార్మి ఫొటో షేర్ చేయడం, అది కూడా డ్రింక్ గ్లాస్ పట్టుకున్న ఫొటో కావడంతో జనాలు మరింత ఆశ్చర్యపోతున్నారు. కాగా, రామ్ గోపాల్ వర్మ షేర్ చేసిన ఈ ఫొటో చూసి ఛార్మి కూడా రియాక్ట్ కావడం విశేషం. కేవలం స్మైలింగ్ ఎమోజీలు పోస్ట్ చేస్తూ తన కామెంట్ వదిలింది ఛార్మి. రామ్ గోపాల్ వర్మకు ఛార్మికి మధ్య మంచి బాండింగ్ ఉంది. గతంలో కూడా ఛార్మితో వర్మ చేసిన ఎంజాయ్ మూమెంట్స్ వైరల్ అయ్యాయి.
By March 10, 2022 at 10:10AM
No comments