Breaking News

ET Twitter Review: సూర్య మాస్ రాంపేజ్.. ఆడియన్స్ ఏమంటున్నారంటే!


కొంతమంది తమిళ హీరోలకు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. అటువంటి హీరోల్లో ఒకరే . అందుకే ఆయన హీరోగా తెరకెక్కిన కొన్ని సినిమాలను నేరుగా తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంటారు. అదే ఫార్మాట్‌లో వచ్చిన సినిమా 'ఈటి' (). ఎవరీకీ తలవంచడు అనేది ఫుల్ నేమ్. విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించి కమర్షియల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న పాండిరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. తమిళంతో పాటు తెలుగులో భారీగా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. మరి ఇప్పటికే ఈ మూవీ ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ టాక్ ఎలా ఉందో చూద్దామా.. గజని, జై భీమ్ లాంటి సినిమాలతో తెలుగు వారి మనసు దోచుకున్న సూర్య.. ఇప్పుడు ET (ఈటి) Etharkkum Thunindhavan (ఎతర్‌క్కుమ్‌ తునిందవన్) మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. పక్కా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు ఇప్పటి వరకైతే పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఇది సూర్య అఫీషియల్ కమ్ బ్యాక్ సినిమా అని, థియేటర్లలో మాస్ రాంపేజ్ అంటూ ట్వీట్లు పెడుతున్నారు సినిమా చూసిన ఆడియన్స్. ఫస్టాఫ్ సీన్స్ అదిరిపోయాయని అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్ మంటపుట్టించిందని అంటున్నారు. సెకండాఫ్ పీక్స్‌లో ఉందని అంటున్నారు. ఇక సూర్య యాక్టింగ్ చించేశారని, పాండిరాజ్ దర్శకత్వ ప్రతిభ మరోసారి రుజువైందని అంటున్నారు. 2022లో ఫస్ట్ రియల్ బ్లాక్ బస్టర్ సినిమా ఇదే అని పేర్కొంటున్నారు. ఈ సినిమా కోసం సూర్య తెలుగులో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. మూడేళ్ల లాంగ్ గ్యాప్ తీసుకొని థియేటర్స్‌లో అడుగుపెట్టారాయన. ఈ సినిమాలో సూర్య సరసన ప్రియాంక అరుల్ మోహన్ నటించగా వినయ్‌ రామ్‌, సత్యరాజ్‌, జయ ప్రకాశ్‌ ఇతర కీలక పాత్రలు పోషించారు.


By March 10, 2022 at 08:17AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/hero-suriya-et-movie-twitter-review-here/articleshow/90114197.cms

No comments