Breaking News

Radhe Shyam Twitter Review : ప్రభాస్ మాస్ జాత‌ర.. ‘రాధే శ్యామ్’ గురించి నెటిజన్స్ ఏమంటున్నారంటే!


బాహ‌బ‌లితో తెలుగు సినిమాను షేక్ చేసిన మ‌న టాలీవుడ్ స్టార్ ప్ర‌భాస్ ఇమేజ్ ఏకంగా పాన్ ఇండియాను దాటేసింది. ఇప్పుడు ఆయ‌న వ‌రుస పాన్ ఇండియా సినిమాల‌నే చేస్తూ వ‌స్తున్నారు. ఆయ‌న యాక్ట్ చేసిన పాన్ ఇండియా మూవీ సాహో రిలీజై రెండున్న‌రేళ్లు దాటేసింది. వ‌రుస యాక్ష‌న్ సినిమాల‌ను చేయ‌డం కంటే డిఫ‌రెంట్ క‌థాంశంతో సినిమా చేయాల‌ని ప్ర‌భాస్ ఓకే చెప్పిన పీరియాడిక్ ల‌వ్ స్టోరి ‘’. ‘రాధే శ్యామ్’ అనేది పీరియాడిక్ ల‌వ్ స్టోరి. యూర‌ప్ బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్కించారు. ప్ర‌భాస్ జోడీగా పూజా హెగ్డే న‌టించింది. పోస్ట‌ర్స్‌, ప్రోమోలు, టీజ‌ర్‌, ట్రైల‌ర్ ఇలా అన్నింటిలో సినిమా మేకింగ్ అంద‌రినీ క‌ట్టిప‌డేసింది. సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆస‌క్తిని రేకెత్తించింది. కృష్ణంరాజు గోపీకృష్ణా మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రాధా కృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వంశీ, ప్ర‌మోద్‌, ప్ర‌శీద ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎప్పుడో విడుద‌ల కావాల్సిన ఈ సినిమా పాండ‌మిక్ వ‌ల్ల వ‌చ్చిన అవాంత‌రాల‌ను దాటుకుని మార్చి 11న రిలీజైంది. ప్ర‌భాస్ ఫ్యాన్స్‌, సినీ ల‌వ‌ర్స్‌, పాన్ ఇండియా మూవీ మార్కెట్ అంతా ప్ర‌భాస్ ‘రాధే శ్యామ్’ కోసం చాలా ఎగ్జ‌యిట్‌మెంట్‌తో వెయిట్ చేశారు. సినిమాను మేక‌ర్స్ మూడు వంద‌ల కోట్ల‌కు పైగానే ఖ‌ర్చు పెట్టి భారీ బ‌డ్జెట్‌తో, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో తెర‌కెక్కించారు. యూర‌ప్‌లో జార్జియా, ఇట‌లీ వంటి దేశాల్లో షూటింగ్ చేశారు. అలాగే క‌రోనా స‌మ‌యంలో భారీ సెట్స్ వేసి హైద‌రాబాద్‌లోనే చిత్రీక‌రించారు. సినిమా టీజ‌ర్‌, ట్రైల‌ర్ అన్నీ సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను మ‌రింత‌గా పెంచేశాయి. టాలీవుడ్‌కి చెందిన సినీ ప్ర‌ముఖులంద‌రూ సినిమా గురించి స్పెష‌ల్‌గా ట్వీట్స్ చేశారు. ఇంత భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ మీద రిలీజైన ‘రాధే శ్యామ్’ గురించి ఫ్యాన్స్‌, ఆడియెన్స్‌, నెటిజ‌న్స్ ఏమంటున్నారంటే... బ్యూటీఫుల్ లవ్ స్టోరి. రాధా కృష్ణ కుమార్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. గ్రేట్ విజువల్స్. ప్రభాస్, పూాజా హెగ్డే జంట చక్కగా ఉన్నారు. తమన్ అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. ఫస్టాఫ్ డీసెంట్‌గా ఉంటే.. సెకండాఫ్ ఎక్సలెంట్. కథను నడిపిన తీరు, సినిమాలోని ట్విస్ట్ మైండ్ బ్లోయింగ్. పాటలు, విజువల్స్ గురించి మరో మాట చెప్పనక్కర్లేదు. ప్రభాస్ లుక్,ఫెర్ఫామెన్స్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉన్నాయి. తమన్ బీజీఎం ఔట్ స్టాండింగ్ ప్రభాస్ కెరీర్‌లో మరో బ్లాక్ బస్టర్. ఫస్ట్ హాఫ్ చాలా బావుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశం సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లెంది. సినిమా సెకండాఫ్ ఎక్సలెంట్. విఎఫ్‌ఎక్స్ సన్నివేశాలు బ్రిలియంగ్‌గా ఉన్నాయి. ప్రభాస్ లుక్ సాహో కంటే బావుంది. పూజా హెగ్డే బ్యూటీఫుల్‌గా, క్యూట్‌గా ఉంది. డైరెక్టర్ రాధా కృష్ణ సినిమాను చక్కగా హ్యాండిల్ చేశారు. మైండ్ బ్లోయింగ్ మూవీ. ప్రభాస్ కెరీర్‌లోనే మరో మైల్ స్టోన్ మూవీ. క్లైమాక్స్‌ను ఊహిచలేం.


By March 11, 2022 at 05:13AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/prabhas-pooja-hegde-pan-india-movie-radhe-shyam-twitter-review-here/articleshow/90137997.cms

No comments