Breaking News

Prabhas: థియేటర్స్‌లో రాధే శ్యామ్ మేనియా.. సాయి తేజ్ సహా సెలబ్రిటీల ట్వీట్స్ వైరల్


చాలా రోజులకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ థియేటర్స్‌లో అడుగుపెట్టారు. సినిమాతో రికార్డులు తిరగరాసేందుకు రంగంలోకి దిగారు. మార్చి 11న ప్ర‌పంచ వ్యాప్తంగా ‘రాధే శ్యామ్’ రిలీజైంది. ప్రభాస్- పూజ హెగ్డే జంటగా వచ్చిన ఈ సినిమా ప్రీమియర్ షోస్ ద్వారా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా భారీ విజయం సాధించాలని కోరుకుంటూ పలువురు సెలబ్రిటీలు ట్వీట్స్ పెడుతున్నారు. రాధేశ్యామ్ సినిమాలో ప్రతీ కంటెంట్‌ను ఆస్వాదించాను. బిగ్ స్క్రీన్‌పై ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆసక్తిగా ఉంది. ప్రభాస్, వంశీ అన్న భారీ విజయాన్ని అందుకోవాలని.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మేనియా కొనసాగాలని కోరుకొంటున్నాను. పూజా హెగ్డే, రాధాకృష్ణ, యూవీ క్రియేషన్స్‌కు ఆల్ ది బెస్ట్ అని సాయిధరమ్ తేజ్ ట్వీట్ పెట్టారు. రాధేశ్యామ్ యూనిట్‌ మొత్తానికి అడ్వాన్స్ కంగ్రాట్యులేషన్స్. టాలీవుడ్‌లో ఇప్పటి వరకు చూడని గ్రాండ్ లవ్ స్టోరి ఇది. ఆన్ స్క్రీన్‌పై ప్రభాస్ డార్లింగ్‌ను చూడటానికి ఎదురు చూస్తున్నాను. ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందని నమ్ముతున్నా. థియేటర్లలో రాధేశ్యామ్‌ను చూడటానికి వెళ్లండి అని మంచు మనోజ్ ట్వీట్ చేశాడు. ఇకపోతే వెండితెరపై మ్యాగ్నమ్ ఓపస్ మూవీ రాధేశ్యామ్ విడుదలైంది. ఈ సినిమాను వెండితెరపై చూడటానికి ఎదురు చూస్తున్నాను అని డైరెక్టర్ మెహర్ రమేష్ ట్వీట్ చేయగా.. గోపీచంద్ మలినేని, డీవీవీ దానయ్య, వెంకీ కుడుముల, వరుణ్ తేజ్ సహా పలువురు దర్శకనిర్మాతలు ఈ సినిమా సక్సెస్ కోరుకుంటూ ట్వీట్స్ పెట్టారు. పీరియాడిక్ ల‌వ్ స్టోరీగా యూర‌ప్ బ్యాక్ డ్రాప్‌లో ఈ రాధే శ్యామ్ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదలకు ముందే పోస్ట‌ర్స్‌, ప్రోమోలు, టీజ‌ర్‌, ట్రైల‌ర్ సినిమాపై ఆస‌క్తిని పెంచేశాయి. కృష్ణంరాజు గోపీకృష్ణా మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రాధా కృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వంశీ, ప్ర‌మోద్‌, ప్ర‌శీద ఈ చిత్రాన్ని నిర్మించారు.


By March 11, 2022 at 07:07AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/celebrity-tweets-on-prabhas-radhe-shyam-movie/articleshow/90138814.cms

No comments