ఉక్రెయిన్‌లో రసాయనిక దాడికి రష్యా ప్లాన్ : అమెరికా
అమెరికా, పరస్పరం సంచలన ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఉక్రెయిన్ వేదికగా రెండు దేశాలు విమర్శలు గుప్పించుకుంటున్నాయి. తాజాగా ఉక్రెయిన్‌లో రసాయనిక, జీవాయుధ దాడికి రష్యా ప్లాన్ చేస్తుందని ఆరోపించింది. మనందరం దానిపై దృష్టి సారించాలంటూ వైట్ హౌస్ ఒక ప్రటకనలో వెల్లడించింది. ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి మీడియాతో మాట్లాడుతూ ఉక్రెయిన్‌లో అమెరికాకు జీవాయుధాలు ఉన్నట్టు రష్యా చేస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు. చేసేందుకు రష్యా ప్లాన్ చేసిందని, అందులో భాగంగానే ఇలాంటి ఆరోపణలు చేసిందని చెప్పారు. యుద్ధాన్ని తీవ్రం చేయడానికి రష్యా సంప్రదాయేతర ఆయుధాలను ఉపయోగించే అవకాశం ఉందని, ఇది ఆందోళనకర విషయమని ఆమె అన్నారు. సాధ్యమైనంత వరకు రసాయనిక ఆయుధాలు వాడుతుందని, లేదంటే చిన్న తరహా అణ్వాయుధం లేదా జీవాయుధాన్ని వాడే ప్రమాదం ఉందని వైట్ హౌస్ ప్రకటించింది. రష్యా, దాని మిత్ర దేశాలు గతంలో సిరియాలో రసాయన ఆయుధాలను వాడినట్టు వెల్లడించారు. అందుకే ఇప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా ఇప్పటికే రష్యా ఉక్రెయిన్‌లో జీవాయుధాలు తయారు చేస్తున్నారని విమర్శించింది. రష్యా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా ఉక్రెయిన్‌లో బయోవెపన్‌లను అభివృద్ధి చేస్తున్నట్లు మాస్కో వద్ద డాక్యుమెంటల్ ఆధారాలు ఉన్నాయన్నారు. బయోలాజికల్ రీసెర్చ్ కోసం ప్రయోగశాలలు ఉక్రెయిన్‌లో ఉన్నాయని నూలాండ్ ధ్రువీకరించారని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమాలకు అమెరికా రక్షణ శాఖ నిధులను సమకూర్చుతోందని చెప్పారు. బయో వెపన్స్ తయారీ గురించి అమెరికా రక్షణ శాఖ, అమెరికా అధ్యక్ష పరిపాలనా యంత్రాంగం అధికారికంగా వివరించాలని డిమాండ్ చేశారు.
By March 10, 2022 at 12:18PM
No comments