Breaking News

రాధే శ్యామ్ బిజినెస్ టార్గెట్.. థియేటర్ కౌంట్? తొలి రోజే కళ్లుచెదిరే వసూళ్లు..!


దాదాపు రెండేళ్ల తర్వాత సినిమాతో పాన్ ఇండియా స్టార్ థియేటర్లలో అడుగుపెట్టారు. ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ఈ రోజే (మార్చి 11) ఈ సినిమా విడుదలైంది. దీంతో ఇన్నాళ్ల ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్ పడింది. ప్రీమియర్స్ ద్వారా సక్సెస్ టాక్ రావడంతో థియేటర్స్‌లో ప్రభాస్ అభిమానుల హంగామా కనిపిస్తోంది. భారీ అంచనాల నడుమ విడుదల చేసిన ఈ సినిమాను ఏయే ఏరియాల్లో ఎన్ని థియేటర్స్‌లో రిలీజ్ చేశారు. విడుదలకు ముందు చేసిన బిజినెస్ ఎంత? మొదటి రోజు కలెక్షన్లు ఎలా ఉండబోతున్నాయనే దానిపై ఓ లుక్కేద్దామా.. అన్ని హంగులతో విడుదలైన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో అనుకున్న స్థాయిలో రిలీజ్ కాలేదని సినీ విశ్లేషకుల రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నారు కానీ ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో థియేటర్ల సంఖ్య తగ్గిందని అంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 860 థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేసినట్లు సమాచారం. ఒక్క నైజాం ఏరియాలో చూస్తే రాధే శ్యామ్ కోసం 335 థియేటర్లకు పైగా కేటాయించారు. కాకపోతే ఇది పుష్ప, భీమ్లా నాయక్, అఖండ థియేటర్ కౌంట్ కంటే తక్కువే అని రిపోర్ట్స్ చెబుతున్నాయి. భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాపై నెలకొన్న బజ్ దృష్ట్యా అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో అన్ని ఏరియాల రైట్స్ కలిపి 202.80 కోట్లకు అమ్ముడైనట్లు ట్రేడ్ పండితులు పేర్కొన్నారు. అయితే ప్రీమియర్స్ కోసం దేశవిదేశాల్లోని ఆడియన్స్ ఎగబడ్డారు. అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్‌లో జరుగుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్‌తో పాటు థియేటర్లలో ఇస్తున్న టికెట్స్ అన్నీ కలుపుకుంటే ఈ 'రాధే శ్యామ్' తొలి రోజు 35 కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాదు గ్రాస్ పరంగా చూస్తే మొదటి రోజే 50 లేదా 100 కోట్ల క్లబ్‌లో చేరడం మాత్రం ఖాయమే అని అంటున్నారు. ఇందుకు తగ్గట్లు థియేటర్ల వద్ద రాధే శ్యామ్ మేనియా కనిపిస్తోంది.


By March 11, 2022 at 07:46AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/report-on-prabhas-radhe-shyam-first-day-collection-expectations/articleshow/90139248.cms

No comments