Pooja Hegde : పూజాహెగ్డేతో మనస్పర్దలు.. ప్రభాస్ క్లారిటీ!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, గ్లామరస్ బ్యూటీ పూజా హెగ్డే నటించిన పాన్ ఇండియా మూవీ ‘’. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదలవుతుంది. సినిమా రిలీజ్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్, పూజా హెగ్డే అండ్ టీమ్ సినిమా ప్రమోషనల్ యాక్టివిటీస్‌లో చాలా బిజీగా ఉన్నారు. ప్రభాస్ అయితే అలుపు లేకుండా ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నారు. ఈ ప్రమోషనల్ యాక్టివిటీస్‌లో ప్రభాస్ పలు ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అయితే ఓ ప్రశ్నకు మాత్రం ఇన్‌డైరెక్ట్‌గా ప్రభాస్ సమాధానం చెప్పేశారు. అసలు ఇంతకీ ఆ ప్రశ్న ఏంటి? ప్రభాస్ ఇన్‌డైరెక్ట్‌గా ఏమని సమాధానం చెప్పారు అనే వివరాల్లోకి వెళితే, ‘రాధే శ్యామ్’ సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్, పూజా హెగ్డేల మధ్య బేదాభిప్రాయాలు వచ్చాయని, అందుకనే ఓ సాంగ్‌లో ప్రభాస్ లేకుండా ఏదో మేనేజ్ చేశారంటూ టాక్ బలంగానే వినిపించింది. అయితే అప్పుడు ప్రభాస్ పిఆర్ టీమ్ దాన్ని బలంగానే ఖండించింది. అయితే దీని గురించి ప్రభాస్ రీసెంట్ ఇంటర్వ్యూస్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. అది కూడా ఇన్ డైరెక్టర్‌గా. అదెలా అంటారా!.. ఓ ప్రశ్నకు సమాధానం చెబుతూ ఆయన పూజా హెగ్డే ప్రస్తావన తీసుకొచ్చారు. ‘‘రాధే శ్యామ్’లో హీరోయిన్ పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అందుకనే ఎంతగానో ఆలోచించి పూజా హెగ్డేను తీసుకున్నాం. నాకు, పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది’ అన్నారు . అంటే పూజా హెగ్డేకు తనకు మధ్య ఎలాంటి మనస్పర్దలు లేవని డార్లింగ్ చెప్పకనే చెప్పేసినట్లుగా యూరప్ బ్యాక్ డ్రాప్‌లో సాగే పీరియాడిక్ లవ్ స్టోరిగా రాధే శ్యామ్‌ను తెరకెక్కించారు. రాధా కృష్ణ కుమార్ దర్శకుడు. గోపీకృష్ణా మూవీస్ కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రమోద్, వంశీ, ప్రశీద ఈ చిత్రాన్ని మూడు వందల కోట్లకు పై బడ్జెట్‌తో నిర్మించారు. ప్రభాస్ విక్రమాదిత్య అనే హస్త సాముద్రికా నిపుణుడి పాత్రలో కనిపిస్తే.. ప్రేరణ అనే మ్యూజిక్ టీచర్ పాత్రలో పూజా హెగ్డే మెప్పించనుంది.
By March 06, 2022 at 08:19AM
No comments