jr Ntr: ఎన్టీఆర్ వీరాభిమాని.. RRR కోసం ఏం చేశాడో తెలుసా.. ఇదెక్కడి అభిమానం!
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను వెండితెరపై చూడాలని ఆయన ప్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆయన గత చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం విడుదలై మూడున్నరేళ్లు దాటిపోయింది. ఆ తర్వాత ఆయన ఒప్పుకున్న చిత్రం RRR. సాధారణంగా రాజమౌళి సినిమా అంటే ఆలస్యం అవుతుంది. కానీ అంతలా కాకుండా రాజమౌళి ముందుగానే ప్లాన్ చేసుకుని 2020లోనే సినిమాను విడుదల చేయాలనుకున్నప్పటికీ కరోనా కారణంగా సినిమా వాయిదాలు పడుతూ వచ్చింది. చివరకు మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో ఎన్టీఆర్‌ను కొమురం భీమ్ పాత్రలో జక్కన్న చూపించనున్న సంగతి తెలిసిందే. ఆయన పెర్ఫామెన్స్‌ను వెండితెరపై చూడాలని ఫ్యాన్ వెయిట్ చేస్తున్నారు. RRRకి సంబంధించి ప్రీ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ముఖ్యంగా ఓవర్ సీస్‌లో RRR ప్రీ బుకింగ్స్ మంచి క్రేజ్‌తో జరుగుతున్నాయి. ఓ అభిమాని అయితే డల్లాస్‌లో ఏకంగా 75.. RRR సినిమా టికెట్స్‌ను కొనుగోలు చేశాడట. అంటే RRR కోసం ఫ్యాన్స్ ఎంతలా ఎదురు చూశారో అర్థమవుతుందని సినీ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక RRR విషయానికి వస్తే ఇందులో తారక్‌తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా మరో హీరో. ఆయన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించబోతున్నారు. చరిత్రలో కలుసుకోని ఇద్దరు యోధులు కలుసుకుని బ్రిటీష్ వారిని ఎదిరిస్తే ఎలా ఉంటుందనే ఫిక్షనల్ పాయింట్‌ను బేస్ చేసుకుని జక్కన్న RRRను తెరకెక్కించారు. నాలుగు వందల కోట్లకు పైగా బడ్జెట్‌తో పెట్టారు. ఇంకా అజయ్ దేవగణ్, ఆలియా భట్, హాలీవుడ్ స్టార్స్ ఒలివియా మోరిస్, అలిసన్ డూడి, రే స్టీవెన సన్ తదితరులు నటించారు. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి.
By March 06, 2022 at 07:32AM
No comments