త్వరలోనే ఇంటివాడు కానున్న యువ నటుడు కార్తీక్ రత్నం.. ఎంగేజ్‌మెంట్ ఫొటోలు వైరల్
టాలీవుడ్‌కి చెందిన యువ నటుడు కార్తీక్ రత్నం త్వరలోనే పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు కాబోతున్నాడు. శనివారం అతనికి ఎంగేజ్‌మెంట్ జరిగింది. పొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నిశ్చితార్థ వేడుకకి ఇరు కుటుంబాల పెద్దలు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అయితే కార్తీక్ రత్నం చేసుకోబోయే అమ్మాయి గురించిన వివరాలు తెలియాల్సి ఉంది. చార్టెడ్ అకౌంటెంట్ కావాలనుకున్న కార్తీక్ రత్నం తర్వాత సినిమాల వైపు ఆకర్షితుడు కావడంతో సీఏను మధ్యలోనే వదిలేసి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. వెంకట్ మహా దర్శకత్వంలో రూపొందిన కేరాఫ్ కంచరపాలెం సినిమాతో ఆయన సినీ రంగ ప్రవేశం చేశారు. అందులో జోసెఫ్ అనే పాత్రలో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇదే సిమిమాను తమిళంలో కేరాఫ్ కాదల్ పేరుతో రీమేక్ చేశారు. అందులోనూ కార్తీక్ రత్నం నటించారు. తర్వాత తమిళ చిత్రం అసురన్‌కు రీమేక్‌గా రూపొందిన తెలుగు చిత్రం నారప్ప రీమేక్‌లో విక్టరీ వెంకటేష్ కుమారుడిగా నటించారు. నారప్పలో వెంకటేష్ పెద్ద కొడుకు ముని కన్నగా నటించి ఆకట్టుకున్నారు. ఆ తర్వాత అర్ధ శతాబ్దం మూవీలో హీరోగా నటించారు. ఆ సినిమాలో కార్తీక్ రత్నం నటనకు మంచి ప్రశంసలే దక్కాయి. తర్వాత రౌడీ బాయ్స్, చెక్ వంటి పలు చిత్రాల్లో నటించారు. అప్ కమింగ్ యాక్టర్‌గా రాణిస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకుంటున్నాడు కార్తీక్ రత్నం.
By March 06, 2022 at 09:14AM
No comments