Breaking News

Kamal Haasan : క్రేజీ అనౌన్స్‌మెంట్ చేసిన కమల్ హాసన్.. విక్రమ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్


యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్ ఎట్ట‌కేల స‌స్పెన్స్‌కు తెర దించారు. ఆయ‌న ప్ర‌స్తుతం క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న భారీ చిత్రం ‘విక్ర‌మ్‌’. వైవిధ్య‌మైన చిత్రాల‌ను తెర‌కెక్కించే దర్శ‌కుడు లోకేష్ క‌న‌క‌రాజ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలను పూర్తి చేసుకునే ప‌నిలో ఉంది. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తామ‌ని రీసెంట్‌గానే ప్ర‌క‌టించిన క‌మ‌ల్ హాస‌న్, లొకేష్ క‌న‌క‌రాజ్‌ అండ్ టీమ్ సోమ‌వారం రోజున ‘విక్ర‌మ్‌’ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. జూన్ 3న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు. క‌మ‌ల్ హాస‌న్ ఎలాంటి న‌టుడో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న‌కు పోటీగా విజ‌య్ సేతుప‌తి, ఫ‌హాద్ ఫాజిల్ వంటి స్టార్స్ కూడా ఈ సినిమాలో న‌టిస్తుండ‌టంతో సినిమాపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట‌ర్స్‌, గ్లింప్స్‌, టీజ‌ర్ అన్నీ సినిమాపై ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను పెంచుతూనే వ‌చ్చాయి. రీసెంట్‌గా రిలీజ్ డేట్‌ను చెబుతూ మేకింగ్ గ్లింప్స్‌ను విడుద‌ల చేశారు. త్వ‌ర‌లోనే భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను చూడ‌బోతున్నారంటూ చిత్ర యూనిట్ తెలియ‌జేసింది. మాన‌గ‌రం, ఖైది, మాస్ట‌ర్ వంటి స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌తో డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌క‌రాజ్ మోస్ వాంటెడ్ డైరెక్ట‌ర్ అయ్యారు. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో సినిమా వ‌స్తున్న సినిమా విక్ర‌మ్. దీంతో సినిమా ఎలా ఉంటుందోన‌ని అంద‌రిలో తెలియ‌ని ఆస‌క్తి నెల‌కొంది. 2018లో విశ్వ‌రూపం త‌ర్వాత క‌మ‌ల్ హాస‌న్ మ‌రో సినిమా చేయలేదు. ఆయ‌న చేసిన భార‌తీయుడు 2 సినిమా అనివార్య కార‌ణాల‌తో ఆగిపోయిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆయ‌న విక్ర‌మ్ సినిమాను అనౌన్స్ చేశారు. రాజ్ కమల్ ఫిలింస్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై ఆర్‌.మ‌హేంద్ర‌న్‌తో క‌లిసి క‌మ‌ల్‌హాస‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు. క‌మ‌ల్ హాస‌న్ న‌టిస్తోన్న 232వ చిత్ర‌మిది. ఈ సినిమాను పూర్తి చేయ‌డానికి క‌మ‌ల్ హాస‌న్ తాను హోస్ట్ చేస్తూ వ‌చ్చిన త‌మిళ బిగ్ బాస్‌ను కూడా వ‌దులుకున్నారు. విల‌క్ష‌ణ పాత్ర‌ల‌తో, సినిమాల‌తో ఐదు ద‌శాబ్దాల‌కు పైగా సినీ జ‌గ‌త్తులో త‌న‌దైన ప్ర‌స్థానాన్ని స్థాపించిన క‌మ‌ల్ హాస‌న్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. న‌టుడు, నిర్మాత‌, ద‌ర్శ‌కుడు, రైట‌ర్ ఇలా సినీ ఇండ‌స్ట్రీలోని అన్ని విభాగాల‌పై మంచి అవ‌గాహ‌న ఉన్న అతి కొద్ది మందిలో క‌మ‌ల్ హాస‌న్ ఒక‌రు.


By March 14, 2022 at 11:13AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/kamal-haasan-vijay-sethupathi-and-fahadh-faasil-movie-vikram-release-date-directed-by-lokesh-kanagaraj/articleshow/90195613.cms

No comments