Breaking News

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పోలెండ్‌కు పారిపోయారా?


ఉక్రెయిన్ అధ్యక్షుడు దేశం విడిచి పారిపోయారని రష్యా అధికారిక మీడియా నివేదిక వెల్లడించింది. శుక్రవారం ఆయన ఉక్రెయిన్ నుంచి వెళ్లిపోయారని, ప్రస్తుతం పొలెండ్‌లో ఉన్నారని రష్యా రాష్ట్రం దుమా స్పీకర్ వ్యాచెస్లావ్ వోలోడిన్ చెప్పినట్టు రష్యా అధికారిక మీడియ స్పుత్నిక్ నివేదించింది. ‘‘వొలిడిమిర్ జెలెన్‌స్కీ ఉక్రెయిన్‌ను వీడారు.. లీవ్‌లోని వెర్ఖొవ్నా రడా సహయకులు ఆయనను కలుసుకోలేకపోయారు.. ప్రస్తుతం ఆయన పోలెండ్‌లో ఉన్నారు’’ అని తన టెలిగ్రామ్ ఛానెల్‌లో వివరించాడు. జెలెన్‌స్కీ భద్రతపై పలు పశ్చిమ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్-వైవ్స్ లే డ్రియన్ అవసరమైతే సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినట్టు స్పుత్నిక్ పేర్కొంది. మరోవైపు, దేశం దాటించడానికి అమెరికా ఆఫర్‌ ఇచ్చింది కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడు తిరస్కరించారు. గతవారం రష్యా దండయాత్ర మొదలుపెట్టిన రెండు రోజుల్లోనే జెలెన్‌స్కీ ఉక్రెయిన్ వీడారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని తిప్పికొడుతూ తాను కీవ్‌లోనే ఉన్నానంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు పలు వీడియో సందేశాలను పంపారు. తాజా నివేదికల ప్రకారం.. ఉక్రెయిన్, రష్యా మధ్య గురువారం జరిగిన రెండో దఫా చర్చల్లో ఎటువంటి ఒప్పందాలపై సంతకాలు చేయలేదని మాస్కో అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు. ‘‘ఇప్పుడు ఈ చర్చలు జరగాల్సి ఉంది.. అనవసరమైన మధ్యవర్తులు లేకుండా అన్ని అంశాలను ఒకరికొకరు తెలియజేయడానికి ప్రతినిధి బృందాలకు ఇది ఒక అవకాశం.. మా డిమాండ్లను ఉక్రేనియన్ దృష్టికి తీసుకెళ్లాం’’ అని సీఎన్ఎన్‌కు తెలిపారు. ఇరు వైపులా ఉన్నతస్థాయిలో ఒప్పందాలు జరిగే అవకాశం ఉందా? అని ప్రశ్నించగా.. ఇంకా ఏ పత్రాలపై నిర్ణయానికి రాలేదు.. సమస్యపై మన దృక్పథాన్ని స్పష్టంగా తెలియజేయడానికి జరిగిన చర్చలు మంచి అవకాశం అని వ్యాఖ్యానించారు.


By March 05, 2022 at 09:45AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/ukrainian-president-volodymyr-zelensky-left-kyiv-and-currently-in-poland-say-russian-media/articleshow/90007288.cms

No comments