Gali Nageshwara Rao : ‘గాలి నాగేశ్వరరావు’గా మంచు విష్ణు
కథానాయకుడిగా కొత్త సినిమా రూపొందుతోందని అందుకు చర్చలు జరుగుతున్నాయనే సంగతి అందరికీ తెలిసిందే. రీసెంట్‌గా విష్ణు ఓ వీడియో ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. కాగా.. విష్ణు ఈసారి గాలి నాగేశ్వరరావు అనే ఓ ఇంట్రస్టింగ్ క్యారెక్టరైజేషన్‌తో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి కోన వెంకట్, చోటా.కె.నాయుడు, అనూప్ రూబెన్స్ వంటి క్రేజీ టెక్నీషియన్స్ వర్క్ చేస్తుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌పై విష్ణు మంచు హీరోగా ఈషాన్ సూర్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. డైరెక్టర్ డెబ్యూ చిత్రమిదే. రచయితగా, సమర్పకుడిగా పలు చిత్రాలకు పని చేసిన కోన వెంకట్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. జి.నాగేశ్వర రెడ్డి స్క్రిప్ట్ అందించారు. విష్ణు మంచు తన ట్విట్టర్ ద్వారా గాలి నాగేశ్వరరావు గెటప్ ఎలా ఉంటుందనే విషయాన్ని తెలియజేశారు. విష్ణు మంచు కొత్త సినిమా గురించి చెప్పినప్పుడు భక్త కన్నప్ప, రావణ బ్రహ్మ సినిమాలేమైనా చేస్తున్నారా? అని కూడా ప్రశ్నలు వచ్చాయి. కానీ రీసెంట్‌గా గాలి నాగేశ్వరరావు పాత్ర అని చెప్పగానే.. ఇది పక్కా కమర్షియల్ మూవీ అనేది క్లారిటీ వచ్చినట్టయ్యింది. హీరోగానే ఆకుండా నిర్మాతగానూ విష్ణు మంచు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక హీరోగా ఆయనకు సరైన హిట్ వచ్చ చాలా రోజులే అయ్యింది. ఆయన గత చిత్రం మోసగాళ్లు సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేసినా ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్‌ను అందుకోలేకపోయింది. మరి గాలి నాగేశ్వరరావుగా విష్ణు మంచు ఎలా మెప్పిస్తారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
By March 05, 2022 at 08:32AM
No comments