Dj Tillu On OTT: టిల్లు గాని పాట పెడితే రికార్డ్స్ అయినా బ్రేక్ అవ్వాల్సిందే!!
చిన్న సినిమా అయినా యూత్ మెచ్చే సినిమా అయితే ఆ సినిమాకు కాసుల పంటే. స్టార్ హీరో సినిమానా కదా అని చూసే రాకులు పోయాయి. కంటెంట్ ఉండాలే గానీ సినిమా సూపర్ హిట్ అవుతోంది. రీసెంట్‌గా విడుదలైన మూవీ కూడా అదే బాటలో వెళ్లి సూపర్ సక్సెస్ సాధించింది. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. DJ Tillu మూవీ విడుదలకు ముందు విడుదల చేసిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తి నెలకొల్పాయి. 'అట్లుంటది మనతోటి' అనే మాస్ స్టేట్‌మెంట్‌తో బరిలోకి దిగిన DJ Tillu బాక్సాఫీస్ దుమ్ముదులుపుతూ నిర్మతలకు లాభాల పంట పండించింది. తొలి రోజే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకొని సునాయాసంగా బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసింది. ఫిబ్రవరి 12న విడుదలై విజయవంతం అయిన ఈ సినిమాకు రెండు రోజుల క్రితం ఆహా ఓటీటీలో రిలీజ్ చేశారు. అయితే ఓటీటీ వేదికపై కూడా అదే రేంజ్ రెస్పాన్స్ అందుకుంటూ భారీ స్థాయిలో వ్యూస్ రాబట్టింది DJ Tillu మూవీ. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన ఆహా టీమ్.. ''టిల్లు గాని పాట పెడితే ఎసుంటి రికార్డ్స్ అయినా బ్రేక్ అవ్వాల్సిందే. అట్లుంటది మనతోని.. 100 మిలియన్ మినిట్స్ ఇన్ 48 హవర్స్'' అని పేర్కొన్నారు. విడుదలైన 48 గంటల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను పూర్తి చేసుకోవడం పట్ల చిత్రయూనిట్ ఆనందంగా ఉంది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ సినిమాకు విమల్ కృష్ణ దర్శకత్వం వహించగా.. సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. సిద్దు జొన్నలగడ్డ సరసన నేహా శెట్టి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా మొదటి నుంచే ప్రేక్షకులలో ఆసక్తిని పెంచుతూ వచ్చారు మేకర్స్. ముఖ్యంగా సాంగ్స్ సినిమాపై భారీ హైప్ తీసుకొచ్చాయి. ఈ భారీ విజయం అందుకున్న సంతోషంలో దీనికి సీక్వల్ రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
By March 07, 2022 at 09:41AM
No comments