పుతిన్‌కు ఎదురుదెబ్బ.. రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోయిన సలహాదారు!
ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మొండి వైఖరితోనే ముందుకెళ్తున్నారు. స్వదేశంలోనూ ఆయన చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా, రష్యా పర్యావరణ వేత్త, దౌత్య అధికారి అనతోలి చుబైస్ సలహాదారు పదవికి రాజీనామా చేసి, దేశం విడిచి వెళ్లిపోయారు. ఉక్రెయిన్ దండయాత్రను నిరసిస్తూ రాజీనామా చేసిన రెండో అత్యున్నత రష్యా అధికారి ఈయనే కావడం విశేషం. సోవియట్ విచ్ఛిన్నం తర్వాత 90వ దశకంలో రష్యా ఆర్ధిక సంస్కరణల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తుల్లో చుబైస్ ఒకరు.
By March 24, 2022 at 08:43AM
By March 24, 2022 at 08:43AM
No comments