Breaking News

మంచు విష్ణుతో మరో ప్రయాణం.. స‌న్నీలియోన్‌ క్రేజీ ఫీలింగ్స్!!


టాలీవుడ్ హీరో, 'మా' అధ్యక్షుడు మంచు విష్ణుతో మరో జర్నీ అంటూ తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. ''ఈ రోజు మంచు విష్ణుతో మరో ప్రయాణాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉంది. ఈ కొత్త సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటిస్తా'' అని తెలిపింది సన్నీలియోన్. ఈ మేరకు ఓ ఫొటో షేర్ చేస్తూ తాను 'రేణుక' అనే పాత్ర పోషిస్తున్నట్లు పేర్కొంది. శృంగార తారగా వరల్డ్ వైడ్ ఫేమస్ అయిన సన్నీలియోన్.. ఆ తర్వాత బాలీవుడ్ గడపతొక్కి నటిగా విపరీతమైన క్రేజ్ సంపాదించింది. మొదట్లో గ్లామర్ పాత్రలు పోషిస్తూ ఆడియన్స్ దృష్టిని తనవైపుకు తిప్పుకున్న సన్నీ.. క్రమంగా తనలో నటనా ప్రతిభ కూడా ఉందని నిరూపించుకుంది. దీంతో ఆమెకు వరుస ఆఫర్స్ రావడం, బిజీ హీరోయిన్ కావడం చకచకా జరిగిపోయాయి. హీరోయిన్‌గా చేస్తూనే స్పెషల్ సాంగ్స్ లోనూ మెరుస్తున్న సన్నీ... తెలుగులో రాజశేఖర్ హీరోగా వచ్చిన 'గరుడ వేగ' సినిమాలో ''డియో డియో'' అంటూ హుషారెత్తించిన సంగతి తెలిసిందే. కాగా, ప్రస్తుతం బాలీవుడ్ పైనే పూర్తి ఫోకస్ పెట్టిన ఈ హాట్ బ్యూటీ ఇప్పుడు తిరిగి తెలుగులో బిజీ కావాలని చూస్తుండటం.. అది కూడా మంచు విష్ణుతో తెరపంచుకోనుండటం ఆసక్తికరంగా మారింది. కెరీర్‌లో సాలిడ్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఈషాన్ సూర్య డైరెక్ట్ చేస్తున్న ఓ సినిమాలో గాలి నాగేశ్వరరావు పాత్రలో నటిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. రీసెంట్‌గా విష్ణు ఓ వీడియో ద్వారా ఈ విష‌యాన్ని తెలియ‌జేశారు. అయితే ఇదే సినిమాలో ఇప్పుడు సన్నీలియోన్ కూడా భాగం కాబోతోందని తెలుస్తుండటం ప్రేక్షకుల్లో ఒకింత క్యూరియాసిటీ పెంచేసిందనే చెప్పుకోవాలి.


By March 08, 2022 at 07:22AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/sunny-leone-crazy-feelings-to-screen-share-with-manchu-vishnu/articleshow/90065581.cms

No comments