Breaking News

రిలీజ్‌కి ముందే ప్రీమియ‌ర్స్ కలెక్షన్స్‌లో ‘ఆర్ఆర్ఆర్’ సరికొత్త రికార్డ్‌.. !


కొన్ని సినిమాల‌కు ఉండే క్రేజ్ మామూలుగా ఉండ‌దు. ఆ క్రేజ్ క‌లెక్ష‌న్స్ మీద ప్ర‌భావం చూపిస్తుంద‌న‌డంలో సందేహం లేదు. అలా ఫ్యాన్స్‌, సినీ ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న సినిమా RRR. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఈ చిత్రంపై అంచ‌నాలు పెర‌గ‌డానికి ప్ర‌ధాన కార‌ణాలు.. మొద‌టి బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి తెర‌కెక్కించిన చిత్రం. టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన , రామ్ చ‌ర‌ణ్ క‌లిసి ఈ సినిమాలో న‌టించ‌డ‌టం. వీరితో పాటు ఆలియా భ‌ట్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్, రే స్టీవెన్ స‌న్‌, ఒలివియా మోరిస్‌, అలిస‌న్ డూడి వంటి బాలీవుడ్, హాలీవుడ్ స్టార్స్ న‌టించ‌టం. RRRను జ‌క్క‌న్న ఓ విజువ‌ల్ వండ‌ర్‌గా తెర‌కెక్కించాడ‌నంలో ఎలాంటి సందేహ‌మూ లేదు. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కోవిడ్ కార‌ణంగా మార్చి 25ప ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగానే ఈ సినిమా ప్రీమియ‌ర్స్‌కు యు.ఎస్‌లో భారీ రేంజ్‌లో బుకింగ్స్ జ‌రిగాయి. ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్న దాని ప్ర‌కారం RRR ప్రీమియ‌ర్స్ వ‌న్ మిలియ‌న్ డాల‌ర్స్‌ను క్రాస్ చేసింది. ఇలా సినిమా ప్రీమియ‌ర్స్‌లో వ‌న్ మిలియ‌న్ డాల‌ర్స్‌ను క్రాస్ చేయ‌డం అది కూడా క‌రోనా స‌మ‌యంలో ఈ రేంజ్ రెస్పాన్స్ రావ‌డం అనేది సినిమాపై ఉన్న అంచ‌నాల‌కు ఉదాహ‌ర‌ణ‌. రిలీజ్‌కు ముందే ట్రిపుల్ ఆర్ క‌లెక్ష‌న్స్ ప‌రంగా ఓ రికార్డ్‌ను క్రియేట్ చేస్తే.. మ‌రి రిలీజ్ త‌ర్వాత ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందో చూడాలి మ‌రి. ఇక RRR సినిమా విషయానికి వ‌స్తే, ఇందులో గోండు వీరుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చ‌ర‌ణ్ న‌టించారు. చ‌రిత్రలో క‌లుసుకోని ఇద్ద‌రు యోధులు క‌లుసుని బ్రిటీష్ వారిని ఎదిరిస్తే ఎలా ఉంటుంద‌నే కాన్సెప్ట్‌తో సినిమా రూపొందింది. డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై నాలుగు వంద‌ల కోట్ల పై బ‌డ్జెట్‌తో డివివి దాన‌య్య ఈ సినిమాను నిర్మించారు.


By March 12, 2022 at 08:25AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/jr-ntr-and-ram-charan-rrr-movie-us-premieres-collections/articleshow/90162751.cms

No comments