రాధే శ్యామ్ ఓపెనింగ్స్.. తొలిరోజు సాలీడ్ కలెక్షన్స్! కలిసొచ్చిన అంశాలివే..
ప్రస్తుతం దేశవిదేశాల్లో మేనియా కనిపిస్తోంది. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత 'రాధే శ్యామ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయన థియేటర్లలో సత్తా చాటుతున్నారు. ఈ రోజే (మార్చి 11) విడుదలైన ఈ సినిమాకు అన్ని ఏరియాల్లో డీసెంట్ ఫస్ట్ టాక్ వచ్చింది. దీంతో మరోసారి ప్రభాస్ రికార్డుల వేట మొదలు కానుందని తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ ప్రీమియర్స్ పరంగా చిత్రానికి సాలీడ్ ఓపెనింగ్స్ వచ్చాయని ట్రేడ్ వర్గాల రిపోర్ట్స్ తెలుపుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 7000కు పైగా స్క్రీన్స్‌లో విడుదలైన ఈ సినిమాకు ఓపెనింగ్స్ అదుర్స్ అనిపిస్తున్నాయి. ప్రభాస్‌కి ఉన్న డిమాండ్ దృష్ట్యా విడుదలకు ముందుగానే ఆన్ లైన్ టికెట్స్ బాగా అమ్ముడయ్యాయి. యూఎస్ ప్రీమియర్ షోస్ ద్వారా 891K డాలర్స్ వచ్చాయని సమాచారం. అదేవిధంగా హిందీలో కూడా బెటర్‌గా పర్ఫామ్ చేసిన ఈ సినిమా 5 నుంచి 6 కోట్ల రేంజ్ నెట్ కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే దాదాపు 30 కోట్ల రూపాయలు కొల్లగొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక్క హైదరాబాద్ సిటీ అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ 6.5 కోట్ల మార్కును క్రాస్ చేయడం, ఆంధ్రాలో కొన్ని చోట్ల హైర్స్ యాడ్ కావడం ఈ సినిమాకు కాస్త కలిసొచ్చిందనేది ట్రేడ్ పండితుల మాట. ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా 202.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది రాధే శ్యామ్ సినిమా. 204 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగి తొలిరోజే భారీ స్పందన తెచ్చుకుంది. ఈ అద్భుతమైన ప్రేమ కావ్యంలో విక్రమాదిత్య అనే హస్తసాముద్రికుడి పాత్రలో ప్రభాస్ కనిపించగా, పూజా హెగ్డే ప్రేరణ రోల్ పోషించింది. వీళ్లిద్దరి కెమిస్ట్రీ, ప్రభాస్ నటన ఈ సినిమాలో హైలైట్ అయ్యాయి. తొలిరోజు కలెక్షన్స్ తాలూకు ఫుల్ రిపోర్ట్ మరికొన్ని గంటల్లో మీ ముందుకు తెస్తుంది మీ 'సమయం తెలుగు'.
By March 11, 2022 at 10:32PM
No comments