నా భార్య స్త్రీ కాదు, మోసపోయాను.. న్యాయం చేయమంటూ సుప్రీంను ఆశ్రయించిన భర్త!
నా భార్య మహిళ కాదని, తనను మోసం చేశారని ఆరోపిస్తూ ఓ వ్యక్తి విడాకుల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎంఎం సుందరేశ్‌ల ధర్మాసనం.. ఈ విషయంలో భార్య స్పందన తెలియజేయాలని కోరింది. వైద్య నివేదికలు ప్రకారం ఆమె స్త్రీ కాదని సదరు భర్త వాదించారు. పురుషాంగంతో పాటు అసంపూర్తిగా ఉన్న యోని ఉంది కాబట్టి స్త్రీ కాదని ఆమె వైద్య నివేదిక చెబుతోంది కాబట్టి నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ధర్మాసనం నోటీసు జారీ చేసింది. అంతకు ముందు సదరు భర్త ఆరోపణలను హైకోర్టు తిరస్కరించింది.‘‘వైద్యపరంగా ఎటువంటి ఆధారాల్లేకుండా కేవలం మౌఖిక సాక్ష్యాలతోనే మోసం చేసినట్టు నిర్ధారణకు రాలేం’’ అని అతడి పిటిషన్‌ను గతేడాది జులై 29న కొట్టివేసింది. దీంతో అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. కేసు వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ జంటకు 2016లో వివాహమయ్యింది. పెళ్లయిన వెంటనే తనకు రుతక్రమం అని చెప్పి శోభనం తప్పించుకుంది. పుట్టింటికి వెళ్లి మళ్లీ ఆరు రోజుల తర్వాత తిరిగొచ్చిందని తెలిపాడు. ఆ తర్వాత మొదటి రాత్రి ఆమెతో కలయిక కోసం ప్రయత్నించగా.. చిన్నపిల్లల మాదిరిగా ఒక చిన్న పురుషాంగం ఉన్నట్టు గుర్తించి షాకయ్యాడు. తర్వాత తన భార్యను వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లగా.. ఆమెకు ‘ఇంపర్‌ఫోరేట్ హైమెన్’ అనే సమస్య ఉందని నిర్ధారణ అయింది. ఇంపర్‌ఫోరేట్ హైమెన్ అంటే యోని బయటపడకుండా చర్మం పొర కప్పి ఉండటం. దీంతో ఆమెకు శస్త్రచికిత్స ద్వారా సరిచేయమని కోరితే.. అయితే గర్భం దాల్చే అవకాశాలు దాదాపు అసాధ్యమని డాక్టర్ వివరించారు. చివరకు తాను మోసపోయానని భావించిన ఆ వ్యక్తి.. ఆమె తండ్రికి ఫోన్ చేసి కుమార్తెను తిరిగి తీసుకెళ్లాలని చెప్పాడు. తన కుమార్తెతో కాపురం చేయాలని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా మామ బెదిరించడానికి ఆరోపించాడు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసి, విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించాడు. ఐపీసీ ప్రకారం భార్య పురుషుడిగా మారినందుకుగానూ ఆమెపై సెక్షన్ 420 కింద క్రిమినల్ నేరం చేసినట్లు పరిగణించాలని భర్త తరఫు లాయర్ ఎన్‌కె మోదీ ధర్మాసనానికి తెలియజేశారు. ఆమె మహిళ కాదు కాబట్టి బాధితుడికి కచ్చితంగా అన్యాయం జరిగిందన్నారు. ఇది పుట్టుకతో వచ్చే సమస్య కాదని, ఆమెకు తన జననాంగాల గురించి తెలిసి తన క్లయింట్‌ను ఉద్దేశపూర్వకంగా మోసం చేసినట్లు కోర్టుకు విన్నవించారు. గతంలో ఆ మహిళకు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేయగా.. జూన్ 2021లో మధ్యప్రదేశ్ హైకోర్టు ఆ ఉత్వర్వులను రద్దు చేసిందని బాధితుడి తరఫు న్యాయవాది సుప్రీం ధర్మాసనానికి తెలిపారు. ఆమె స్త్రీ కాదని నిరూపించడానికి తగిన ఆధారాలు ఉన్నాయని తన వాదన వినిపించారు. దీంతో ఈ కేసుపై నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని భార్య, ఆమె తండ్రి, మధ్యప్రదేశ్ పోలీసులకు ధర్మాసనం శుక్రవారం నోటీసులు జారీ చేసింది.
By March 14, 2022 at 11:41AM
No comments