త్వరలోనే ప్రభాస్ కొత్త సినిమా ప్రకటన.. భారీ సెట్ సిద్ధం చేస్తున్న డైరెక్టర్ మారుతి!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘రాధే శ్యామ్’. రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఇది డార్లింగ్ అభిమానులకు నిరాశను కలిగించే విషయం అనడంలో సందేహం లేదు. ఓ రకంగా ప్రభాస్ ఫ్యాన్స్ డైరెక్టర్ రాధా కృష్ణ కుమార్‌పై గుర్రుగా ఉన్నారు. స్టార్ డైరెక్టర్ అయ్యుంటే ప్రభాస్‌ను చక్కగా హ్యాండిల్ చేసేవాడని.. రాధా కృష్ణ కుమార్ సరిగ్గా హ్యాండిల్ చేయలేదని కూడా ప్రభాస్ ఫ్యాన్స్‌లో కొందరి వాదన. అయితేప్రభాస్ తదుపరి చిత్రాన్ని మారుతి దర్శకత్వంలో చేస్తాడనే వార్తలు వచ్చాయి. అసలు ఈ నేపథ్యంలో ప్రభాస్ - మారుతి సినిమా ఉంటుందా? అనే సందేహాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు, ప్రభాస్ - మారుతి దర్శకత్వంలో సినిమా ఉంటుందని, త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన కూడా వెలువడుతుందని అంటున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్‌ను మెప్పించేలా అన్ని కమర్షియల్ హంగులతో డైరెక్టర్ మారుతి పక్కా మాస్ మసాలా ఎంటర్‌టైనింగ్ సబ్జెక్ట్‌ను తయారు చేశాడట. అది నచ్చే డార్లింగ్ ఓకే చెప్పినట్లు టాక్. ఇందులో ముగ్గురు హీరోయిన్స్ ప్రభాస్‌తో జత కట్టబోతున్నారని వారిలో ఇప్పటికే రాశీ ఖన్నా, మాళవికా మోహనన్ ఫైనలైజ్ అయినట్లు కూడా న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ప్రభాస్ చేతిలో వరుస పాన్ ఇండియా సినిమాలున్నాయి. చాలా బిజీగా ఉన్నారు. ప్రభాస్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని నెటివిటీకి తగ్గట్టు కథను సిద్దం చేసిన మారుతి, చాలా తక్కువ డేట్స్‌నే ప్రభాస్ నుంచి తీసుకున్నారట. వీలైనంత త్వరగానే ప్రభాస్ సినిమాను త్వరితగతిన పూర్తి చేయాలనేది మారుతి ప్లాన్‌గా కనిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ను కూడా ఎక్కువ భాగం స్టూడియో, సెట్స్‌లోనే పూర్తి చేసేలా ప్రణాళికలు కూడా జరిగిపోయాయి. హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఓ సెట్‌ను మారుతి సిద్ధం చేయిస్తున్నారట.
By March 14, 2022 at 12:18PM
No comments